SKLM: ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐలో దీపక్ మైనింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ CSR నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను బుధవారం ఎచ్చెర్ల MLA ఈశ్వరరావు ప్రారంభించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ఇది కీలక చర్యగా ఆయన పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి ఈ ప్లాంట్ ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందన్నారు.