బాపట్ల: కర్లపాలెం పంచాయతీ పరిధిలోని తారకరామా నగర్లో బుధవారం ‘స్వచ్ఛ పదం’ కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో సూచించారు. ప్రతి బుధవారం గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.