నారాయణపేట జిల్లా వ్యాప్తంగా రైతులకు రావాల్సిన యూరియా లోడ్ సమయానికి రావడం లేదని ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి అన్నారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. యూరియా సమయానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అధికారులు యూరియా సరఫరాను నిశితంగా పరిశీలించారని ఆమె కోరారు.