BHNG: భువనగిరి మండలం పడాయి గూడెం గ్రామంలో డెంగ్యూ వ్యాధితో మహిళ మృతి చెందిన ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వల్లాల బుజ్జమ్మ రెండు రోజుల క్రితం భవనగిరిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి విషమించటంతో రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు.