MNCL: మందమర్రి ఏరియా KK-OCలో ఆగస్టు చివరి వారంలో విధి నిర్వహణ విషయంలో కార్మిక సంఘాల నేతల మధ్య జరిగిన గొడవలో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. శనివారం SI రాజశేఖర్ ప్రకటన ప్రకారం కోర్టు అనుమతితో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది సింగరేణి చరిత్రలో మొదటి కేసుగా పలువురు పేర్కొంటున్నారు. ఈ ఘటన కేసు వరకు రావడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమంటున్నారు.