KMR: పిట్లం మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో HP గ్యాస్ వినియోగదారులు అదనపు వసూళ్లతో అల్లాడిపోతున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే క్రమంలో డెలివరీ బాయ్స్ సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు మొత్తాన్ని డిమాండ్ చేస్తుండటంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.