తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ (RTC) విలీన బిల్లును ఆమోదించకపోవడంపై రాజ్‌భవన్ క్లారిటీ ఇచ్చింది. ‘బిల్లును ఆమోదించాలంటూ ఈనెల 2న సాయంత్రం 3.30 గంటలకు ప్రభుత్వం రాజ్ భవన్(Raj Bhavan)కు పంపింది. మరుసటి రోజే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి, లీగల్ సలహా (Legal advice) తీసుకుని నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పడుతుంది’ అని గవర్నర్ ప్రెస్ నోటిస్ రిలీజ్ చేసింది.. బిల్లును పరిశీలించి న్యాయ సలహాలు తీసుకుంటానని, అందుకు కొంత సమయం కావాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే(Assembly meeting) ప్రవేశ పెట్టాలని భావించింది. ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్(Governor)కు పంపించింది. దీనిపై ఆర్టీసీ సంఘలు భగ్గుమంటున్నాయి చలో రాజ్ భవన్‌కు పిలుపునిచ్చే యోచనలో కార్మిక సంఘాలు ఉన్నాయి