»Dasoju Shravan Kurra Satyanarayana To Raj Bhavan In The Evening
Tamilisai : సాయంత్రం గవర్నర్ ను కలవనున్న దాసోజు, కుర్రా
బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. అక్కడ గవర్నర్ తమిళి సాయిని కలిసి హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని వినతిపత్రం సమర్పించనున్నారు.
Tamilisai :బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. అక్కడ గవర్నర్ తమిళి సాయిని కలిసి హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని వినతిపత్రం సమర్పించనున్నారు. ఆమెను కలిసిన అనంతరం గవర్నర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేయనున్నారు. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3), 171(5)లో పేర్కొన్న విధంగా సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాలలో వారికి ప్రత్యేక నైపుణ్యం లేదా ఆచరణాత్మక అనుభవం లేదని ప్రకటించారు.
కాగా, ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు లేదని హైకోర్టు పేర్కొంది. దానిని తిరిగి కేబినెట్‌కు పంపాలని, తిరస్కరించకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొత్త ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. తీర్పు ప్రకారం.. రేవంత్ సర్కార్ మరోసారి ఎమ్మెల్సీల నియామకం చేపట్టాల్సి ఉంటుంది.