Co-Working Spaces In Goa : ఇటీవల కాలంలో ఏ మాత్రం ఒత్తిడిగా అనిపించినా చాలా మందికి గోవాకి ప్రయాణం అయిపోతున్నారు. అయితే ఆఫీసు బిజీ వర్క్‌ల వల్ల వర్క్ ఫ్రం హోంలో ఉన్నా అక్కడికి వెళ్లలేని వారు చాలా మంది ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి వారికోసం గోవా బీచ్‌లు సిద్ధమవుతున్నాయి. ఆ బీచ్‌ల్లో కో వర్కింగ్ స్పేస్‌లు సిద్ధం అవుతున్నాయి.
చక్కగా సముద్రాన్ని చూస్తూ ఆఫీస్ పనులు చేసుకోవాలనుకునే వారి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం గోవాలో కో వర్కింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఈ రకంగా పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తోంది. గోవాకి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. విదేశీయుల్లో ముఖ్యంగా యూరోపియన్లు వస్తుంటారు. అలాంటి వారికి బీచ్‌ల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే బాగుంటదని గోవా(Goa) ప్రభుత్వం ఆలోచిస్తోంది. తద్వారా బీచ్‌ల్లో మరింత వ్యాపారం పెరుగుతుందని భావిస్తోంది.
గోవాకు దాదాపుగా 100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతంలో 35 వరకు బీచ్‌లు ఉన్నాయి. కొన్ని బీచ్‌ల్లో అయితే జనాలు చాలా తక్కువగా ఉంటారు. నిశ్శబ్దంగా ఉంటాయి. ఎక్కడ చూసినా తాటి చెట్లతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో ఈ బీచ్‌లను చూసేందుకు పర్యాటకులు ఎంతో ఇష్ట పడుతుంటారు. వర్క్ ఫ్రం హోం జాబ్‌లు చేసుకునే వారికి కూడా ఇక మీదట ఇక్కడ అక్కడక్కడ కో వర్కింగ్ స్పేస్‌లు ఏర్పాటైతే పర్యాటకం మరింత పుంజుకుంటుంది.