Rakul wedding: రకుల్ పెళ్లి సినిమాను మించి ఉందిగా.. అదిరింది!
ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లైపోయింది. గోవాలో చాలా గ్రాండ్‌గా రకుల్ పెళ్లి జరిగింది. అయితే.. రకుల్ పెళ్లి సినిమాకు మించినట్టుగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో రకుల్ పెళ్లి వీడియో.. వావ్ అనేలా వైరల్ అవుతోంది.
Rakul wedding: ఎవ్వరైనా సరే ఏదో ఒక సమయంలో ప్రేమలో పడాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే. ప్రేమలో పడకపోయిన ఆరెంజ్డ్ మ్యారెజ్ అయిన చేసుకోవాల్సిందే. కానీ సెలబ్రిటీస్ విషయంలో మాత్రం ప్రేమ పెళ్లిలే ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే హీరో, హీరోయిన్లు ప్రేమలో పడినంత మాత్రన పెళ్లి పీఠల వరకు వెళ్తారనే గ్యారెంటీ లేదు. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ప్రేమ కహానీ కూడా పెళ్లి వరకు వెళ్తుందని అనుకోలేదు చాలామంది. అందుకే.. ఇప్పుడు రకుల్ పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ వివాహం ఈనెల 21న గోవాలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే.
ఈ పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రకుల్‌కు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తాజాగా రకుల్ ప్రీత్ తన పెళ్లికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందులో రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఓ సినిమాలో భారీ సాంగ్‌ను ఎలా అయితే షూట్ చేస్తారో అంతకు మించి ఉంది రకుల్ పెళ్లి వీడియో. అసలు ఇది పెళ్లి వీడియోనా? లేక సినిమా కోసం చేసినా ప్రోమోనా? అన్నట్టుగా ఉంది. ఈ వీడియోలో రకుల్ ఎంట్రీ నుంచి హల్దీ ఫంక్షన్ ఫోటోలు కూడా చూపించారు. ప్రస్తుతం రకుల్ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏదేమైనా.. రకుల్ పెళ్లి మాత్రం సినిమాకు మించి జరిగిందనే చెప్పాలి.