KDP: మైదుకూరు పట్టణంలో మహిళలు, పిల్లల భద్రత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మైదుకూరు అర్బన్ SI కె.రమణా రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు అన్ని పాఠశాలలు, కళాశాలల వద్ద విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం విద్యార్థినులకు, మహిళలకు భద్రత కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని SI తెలిపారు.