MDK: తూప్రాన్ పట్టణంలో చోరీకి పాల్పడిన నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంటకు చెందిన నిందితుడు కట్ట నవీన్ (26) అరెస్టు చేసి చోరీ సొత్తు రికవరీ చేసినట్లు తూప్రాన్ సిఐ రంగాకృష్ణ తెలిపారు. 25న రాత్రి పట్టణానికి చెందిన ఆశ్రఫ్ అలీ ఇంట్లో చోరీ చేసిన ఏడు తులాల బంగారు ఆభరణాలు, 37 తులాల వెండి ఆభరణాలు, రెండు విలువైన వాచ్ లు, రూ. 20 వేల నగదు రికవరీ చేశామన్నారు.