CTR: అర్హులైన పేదలకు ప్రభుత్వాల సంక్షేమ పథకాలను చేరువచేసి, వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు సూచించారు. కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ అధ్యక్షతన కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.