ఖమ్మం నగరంలోని ప్రకాశ్ నగర్లో రోడ్ల వెడల్పు పనులు నిలిపివేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానికులతో కలిసి ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇళ్లు కోల్పోతున్నామని స్థానికులు పనులను అడ్డుకోవడంతో, పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.