ATP: కుందుర్పి మండలం మాలయనూరు గ్రామంలో రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ప్రతి గ్రామంలోనూ ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.