కడప సబ్ డివిజన్ పరిధిలోని విశ్వం థియేటర్లో యాంప్లిఫైయర్లు, మోటార్లు, వైర్లు చోరీ చేసిన ఐదుగురు నిందితులను కడప వన్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సీఐ చిన్న పెద్దయ్య, ఎస్పై ప్రతాప్ రెడ్డి బృందం గుర్రాలగడ్డ జెండా చెట్టు వద్ద షేక్ తబ్రిశ్, ఉమర్, సద్దాం, ముర్ఫత్, గౌస్లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.70,000 విలువైన రాగి వైరును స్వాధినం చేసుకున్నారు.