మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు దశాబ్ద కాలం తర్వాత తల్లి దండ్రులైన సంగతి తెలిసిందే. అయితే.. మొదటి బిడ్డ కోసం పదేళ్లు సమయాన్ని తీసుకున్న ఉపాసన రెండోసారి మాత్రం అలా కాదని చెప్పి.. మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.
Upasana: గతేడాది రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. 2023 జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత మెగా వారసురాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగాభిమానులు తెగ మురిసిపోయారు. ఆ పాపకు క్లింకారా అని నామకరణం చేశారు. పోయిన వినాయక చవితి సందర్భంగా.. పుట్టిన మూడు నెలలు తర్వాత మెగా ఇంట అడుగుబెట్టింది క్లింకార. మెగా వారసురాలు మొదటి సారి ఇంట్లో అడుగుపెడుతుండటంతో.. ఆ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు మెగా ఫ్యామిలీ వారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి చెందిన వేదపాఠశాల విద్యార్థులు వేదం మంత్రాల మధ్య క్లింకారాను ఇంట్లోకి అహ్వానించారు.
కానీ ఇప్పటి వరకు కనీసం క్లింకారా మొహాన్ని కూడా చూపించలేదు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంతా క్లింకారను చూడ్డానికి వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా ఉపాసన చేసిర కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. నేను ఆలస్యంగా పిల్లలను కావాలి అనుకున్నాను. అందుకే పదేళ్ల తర్వాత తల్లిని అయ్యాను. కానీ ఈ విషయంలో విమర్శలు, ఒత్తిడికి గురయ్యాను. అందుకే.. రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పులు చేయలని అనుకోవడం లేదు. రెండో బిడ్డకి జన్మనివ్వడానికి నేను రెడీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. దీంతో.. నెక్స్ట్ వచ్చేది మెగా వారసుడేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెగాభిమానులు. మరి చరణ్, ఉపాసన గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో చూడాలి.