»Nandamuri Mokshajna And Srileela Balayyas Pair Is Happy
Srileela: పెద్దింటి కోడలుగా శ్రీలీల?
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే అమ్మడికి కాస్త ఫ్రీ టైం దొరికింది. ప్రస్తుతం గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతోంది శ్రీలీల. ఈ నేపథ్యంలో శ్రీలీల పెద్దింటి కోడలు కాబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది.
Balayya is happy with Srileela's pairing with Nandamuri Mokshajj
Srileela: ఇప్పటి వరకు శ్రీలీల లవ్ గురించి ఎలాంటి పుకార్లు బయటికి రాలేదు. కాకపోతే.. భగవంత్ కేసరి సినిమా సమయంలో బాలయ్య కొడుకు మోక్షజ్ఙ శ్రీలీలతో కనిపించాడు. ఒక్కసారి కాదు.. ఆ సినిమా మొదలైనప్పటి నుంచి శ్రీలీల వెంటే కనిపించాడు మోక్షజ్ఙ. దీంతో మోక్షజ్ఞ లాంచింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా కన్ఫర్మ్ అయిందనే కామెంట్స్ వినిపించాయి. చూడ్డానికి ఈ ఇద్దరి జోడి బాగుందని అన్నారు. కథ కుదిరితే.. ఫ్యూచర్లో ఈ ఇద్దరు కలిసి నటించే అవకాశాలున్నాయి అని అన్నారు. అయితే ఇదంతా సినిమాటిక్ వెర్షన్ మాత్రమే.. కానీ శ్రీలీలతో కలిసి మోక్షజ్ఙ కనిపించడం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కొందరైతే ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందనే గుసగుసలు కూడా వినిపించాయి. కానీ ఆ తర్వాత మరోసారి ఇద్దరు కలిసి కెమెరా కంట పడలేదు.
దీంతో ఈ వ్యవహారం అక్కడితోనే ఆగిపోయింది. కాని ఇప్పుడు శ్రీలీల ఇండస్ట్రీలోనే ఓ పెద్దింటి కోడలు కాబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అసలు ఈ న్యూస్ ఎలా లీక్ అయిందో ఏమో గానీ.. శ్రీలీల తల్లి ఆమె జాతకాన్ని ఓ ప్రముఖ జ్యోతిష్యుడికి చూపించందట. అతను మీ అమ్మాయి ఓ పెద్దింటికి కోడలుగా వెళ్లబోతుందని చెప్పాడట. ప్రస్తుతం కన్నడ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. చిన్నప్పటి నుంచి శ్రీ లీల కర్ణాటకలోనే పెరిగింది. బెంగుళూరులోనే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కాబట్టి శ్రీలీల గురించి అక్కడ ఇలాంటి వార్తలు లీక్ అవుతునే ఉంటాయి. కానీ శ్రీలీల జాతకం ప్రకారం ఇండస్ట్రీ ఫ్యామిలీకి కోడలు అనేసరికి.. అమ్మడు ఎవరి ఇంటికి కోడలుగా వెళ్తుందా? అనే చర్చ జరుగుతోంది. మరి నిజంగానే శ్రీలీల ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటుందా?