మహేష్ బాబుతో తెలుగు తెరకు పరిచయమైన ఓ హీరోయిన్ తల్లి కాబోతుందా? అంటే, ఔననే అంటున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్? పెళ్లెప్పుడు చేసుకుంది? ప్రెగ్నెంట్ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది?
Kiara Advani: తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ చరణ్ సరసన వినయ విధేయ రామ.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది కియారా. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది అమ్మడు. సౌత్‌తో పాటు బాలీవుడ్లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది కియారా అద్వానీ. బాలీవుడ్లో ఈ బ్యూటీ గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన హిందీ చిత్రాలన్నీ కూడా మంచి విజయాన్ని సాధించాయి. కానీ కెరీర్ ఓ రేంజ్లో దూసుకుపోతున్నప్పుడు అమ్మడు పెళ్లి పీఠలెక్కేసింది. చాలా కాలంగా యంగ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన కియారా అద్వానీ.. ఫైనల్‌గా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. జైపూర్‌లోని ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది.
ప్రస్తుతం ఈ జంట ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీ అయిపోయారు. కానీ ఆ మధ్య కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అనే న్యూస్ వైరల్‌గా మారింది. కొన్ని ఫోటోలలో కియారా అద్వానీ బేబి బంప్‌తో ఉన్నట్లుగా కనిపించడంతో.. ప్రెగ్నెంట్ న్యూస్ వైరల్ అయింది. కానీ ఆ తర్వాత అందులో నిజం లేదని తెలిసింది. అయితే.. ఈసారి మాత్రం అలా కాదనే మాట వినిపిస్తోంది. కియారా అద్వానీ తల్లి కాబోతుందంటూ బాలీవుడ్ మీడియాలో జోరుగు ప్రచారం జరుగుతోంది. కానీ కియారా చెప్పే వరకు ఈ విషయంలో నిజం ఉందని చెప్పలేం అంటున్నారు కియారా అభిమానులు. ఇంకా దీనిపై కియారా దంపతులు స్పందించలేదు. మరి కియారా ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.