గోవా సందర్శించాలని చాలామంది కోరుకుంటారు. కానీ కొన్ని ప్రదేశాలను మాత్రమే సందర్శిస్తారు. అయితే గోవాలో ఈ ప్రదేశాలు తప్పకుండా సందర్శించాలి. ఆ ప్రదేశాలేంటో తెలుసుకుందాం పదండి.
Goa: వీకెండ్ లేదా సెలవులు వచ్చాయంటే చాలు.. మనలో చాలామందికి ముందుగా గోవా గుర్తుకు వస్తుంది. ప్రకృతిని ఆస్వాదించే పచ్చని చెట్లు, అందమైన బీచ్‌లు, అద్భుతమైన పురాతన కట్టడాలు కనులు విందు చేస్తాయి. అయితే ఈ గోవాలో చాలామందికి అంతగా తెలియని ప్రదేశాలు ఉన్నాయి. గోవాలో ఉన్న కొన్ని ప్రదేశాలు చూస్తే ఈ ప్లేస్‌లు ఎవరు కూడా సందర్శించడం మిస్ చేయకూడదనిపిస్తుంది. మరి ఆ ప్రదేశాలేంటో తెలుసుకుందాం.
గోవా రాజధాని పనాజిని విజిట్ చేయడం మాత్రం మరిచిపోవద్దు. ఇక్కడ ఉండే పోర్చుగీస్ కాలనీ ఆర్కిటెక్చర్, పాపులర్ మార్కెట్స్ చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరికి ఇవి నచ్చుతాయి. అలాగే గోవాలో ఉండే పాపులర్ ఫుడ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. నార్త్ గోవాలోని కలంగూట్ లోకేషన్స్ కూడా బాగుంటాయి. ఈ బీచ్ తీరంలో స్టే చేస్తే ఆహ్లాదకంగా ఉంటుంది. ఈ బీచ్‌లో సందడి ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ కలంగూట్ బీచ్ నుంచి భాగా బీచ్‌కి నడుచుకుంటూ వెళ్లవచ్చు. ఇక్కడి నైట్ లైఫ్, మార్కెట్స్ అద్భుతంగా ఉంటాయి.
రద్దీ తక్కువగా ఉంటూ బీచ్‌లో ప్రశాంతంగా గడపాలని అనుకునే వాళ్లు అరంబోల్ బీచ్‌కు వెళ్లండి. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ఓల్డ్ గోవాలో చారిత్రక ప్రదేశాలు చాలా ఉన్నాయి. యూనెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన చర్చ్‌లు కూడా ఉన్నాయి. వీటిని సందర్శించడం మరిచిపోవద్దు. గోవాలో ఫేమస్ వ్యూ పాయింట్ డోనా పౌలా. ఈ పాయింట్ నుంచి అరేబియా సముద్రం అద్భుతంగా కనిపిస్తుంది.