»Chiranjeevi Minister Ponguleti Srinivas Reddy Launched The Telugu Dmf Website
Telugu DMF: తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వెబ్ సైట్ ప్రారంభించిన చిరంజీవి
వెబ్ మీడియా రంగంలో విప్లవాత్మక రీతిలో తెలుగుడీఎంఎఫ్ ఏర్పాటు చేశారు. కంటెంట్ క్రియేటర్లకు అండగా నిలిచే ఐక్య వేదిక వెబ్ సైట్‌ను చిరంజీవి ప్రారంభించగా, లోగో, పోస్టర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.
Chiranjeevi, Minister Ponguleti Srinivas Reddy launched the Telugu DMF website
Telugu DMF: వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాకు సంఘాలు ఉన్నాయి. అలాగే వెబ్ మీడియా, సోషల్ మీడియా రంగంలోనూ ఓ ఐక్య వేదిక ఉండాలని కొత్తగా తెలుగుడీఎంఎఫ్ వెలసింది. వెబ్ సైట్లు, డిజిటల్ కంటెంట్ పోర్టళ్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ల మేలు కోసం తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్‌ను మెగాస్టార్ చిరంజీవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కంటెంట్ క్రియేటర్లకు ఈ వేదిక అండదండగా నిలవనుంది.
దీనికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ www.telugudmf.com ను చిరంజీవి ఆవిష్కరించగా.. తెలంగాణ సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫెడరేషన్ లోగో, స్వాగత పోస్టర్లను ఆవిష్కరించారు. నిజంగా ఈ ఫెడరేషన్ అనేది ఒక విప్లవాత్మక నిర్ణయమని చిరంజీవి పేర్కొన్నారు. వివిధ రకాల వెబ్ రైటర్లు, ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్లు, ట్విట్టర్ ఇన్ ఫ్లుయెన్సర్లు, మీమ్ సృష్టికర్తలను ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు ఈ ఫెడరేషన్ ఏర్పడడం హర్షణీయం అని పేర్కొన్నారు.