తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోన్న వేళ భారతీయ జనతా పార్టీకి అసంతృప్తి జ్వాలలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదలతో కాషాయ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు బీజేపీ(BJP)కి గుడ్ బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి (Ramadevi) ఆ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా పార్టీలో సేవ చేస్తున్న నాయకులకు కూడా టికెట్ (Ticket) లభించలేదన్నారు. ఈ క్రమంలోనే రమాదేవి అధిష్టానంపై ఫైర్ అవుతూ కన్నీరు మున్నీరు అయ్యారు. అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన అనంతరం ఆమె మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన ఆవేదనను వెల్లడించారు. మొన్న కాక నిన్న వచ్చిన వాళ్లకి పార్టీ టికెట్ ఇస్తే ఎలా అంటూ పార్టీని ప్రశ్నించారు.
కన్నతల్లి లాంటి బీజేపీ తనకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. నియోజకవర్గంలో రెండు సార్లు సెండ్ ప్లేస్లో ఉన్న తనను కాదని, మూడవ స్థానంలో ఉన్న కొత్త వ్యక్తికి టికెట్ కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. నమ్ముకున్న పార్టీ నన్న మోసం చేసిందని కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీకి, జిల్లాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తానని, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాని చెప్పారు. ముధోల్(Mudhol)నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు.