»Big Boost In Maharashtra Aurangabad Zp Chairperson Firoz Khan Joins In Brs Party
Maharashtraలో బీఆర్ఎస్ హవా.. అక్కడి జెడ్పీ చైర్మన్ చేరిక
రాఠా గడ్డలో రెండు సభలు నిర్వహించగా అద్భుత స్పందన లభించింది. ఇక మూడో సభ ఔరంగాబాద్ (ఛత్రపతి శంభాజీ నగర్ కొత్తపేరు)లో ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నారు. సభకు భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
తెలంగాణ తర్వాత అంతటి ఆదరణ బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రలో (Maharashtra) లభిస్తోంది. ఇప్పటికే నాందేడ్ జిల్లాలో (Nanded District) నిర్వహించిన రెండు భారీ బహిరంగ సభలు ఊహించని స్థాయిలో విజయం సాధించాయి. ఇక అప్పటి నుంచి మరాఠా గడ్డలో బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi)పేరు మార్మోగుతోంది. తాజాగా ఔరంగబాద్ (Aurangabad)లో సభ నిర్వహించడానికి సిద్ధమవుతుండడంతో మరాఠా నేతలు గులాబీ కండువా వేసుకునేందుకు క్యూలు కడుతున్నారు.
ఇప్పటికే మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇలా రెండో స్థాయి నాయకులంతా బీఆర్ఎస్ (BRS Party) గూటికి చేరుతున్నారు. తాజాగా ఈనెల 24వ తేదీన నిర్వహించే సభ ఔరంగాబాద్ కు చెందిన కీలక నాయకులు బీఆర్ఎస్ లో చేరాడు. ఆయనే ఔరంగాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ (K Chandrashekhar Rao) ప్రకటించడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు జై కడుతున్నారు.
బీఆర్ఎస్ ను విస్తరించాలనే కార్యాచరణలో భాగంగా మహారాష్ట్రను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే మరాఠా గడ్డలో రెండు సభలు నిర్వహించగా అద్భుత స్పందన లభించింది. ఇక మూడో సభ ఔరంగాబాద్ (ఛత్రపతి శంభాజీ నగర్ కొత్తపేరు)లో ఈనెల 24వ తేదీన నిర్వహించనున్నారు. సభకు భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ నేపథ్యంలోనే ఎన్సీపీ నాయకుడు, ఔరంగాబాద్ జెడ్పీ చైర్మన్ ఫిరోజ్ ఖాన్ (Firoz Khan), ఎన్సీపీ ఔరంగాబాద్ ఉపాధ్యక్షుడు రణ్వాసింగ్, విదర్భ షెట్కారీ సంఘటన్ అధ్యక్షుడు జగదీశ్ పాండే, మహారాష్ట్ర అన్నదాత షెట్కారీ సంఘటన్ అధ్యక్షుడు జయజీరావు సూర్యవంశీ, పోలంబరి ఎన్సీపీ ఉపాధ్యక్షుడు త్రయంబత్ మడ్గేలు గులాబీ కండువా వేసుకున్నారు.
ప్రత్యేకంగా హైదరాబాద్ (Hyderabad)కు వచ్చి ప్రగతిభవన్ (Pragati Bhavan)లో సీఎం కేసీఆర్ (KCR) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఔరంగాబాద్ సభను విజయవంతం చేయాలని ఆ నాయకులకు సీఎం కేసీఆర్ సూచించారు. కాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసింది. అందులో భాగంగానే వరుస సభలు మహారాష్ట్రలో నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా తెలంగాణకు చెందిన నాయకుల కమిటీని మహారాష్ట్రకు పంపించిన విషయం తెలిసిందే.