»Maharashtra Police Objected Brs Public Meeting In Aurangabad
KCRకు షాక్.. మహారాష్ట్రలో సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ అంగీకరించలేదు. తాము నిర్ణయించుకున్న చోటే నిర్వహించాలని పట్టుబట్టారు. దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను నిర్వహించి తీరాలని గులాబీ దళపతి ఉన్నారు.
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekhar Rao) అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ను విస్తరించాలనే కార్యాచరణలో భాగంగా మహారాష్ట్రను (Maharashtra) ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే మరాఠా గడ్డలో రెండు సభలు నిర్వహించగా అద్భుత స్పందన లభించింది. ఇక మూడో సభ కూడా నిర్వహించాలని తేదీలు ఖరారు చేసుకోగా మహారాష్ట్ర పోలీసులు షాకిచ్చారు. కేసీఆర్ నిర్వహించాల్సిన బహిరంగ సభకు అనుమతి (Permission Denied) నిరాకరించారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ (ఛత్రపతి శంభాజీ నగర్ కొత్తపేరు)లో (Aurangabad) ఈనెల 24వ తేదీన బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ (KCR) నిర్ణయించారు. అక్కడి అంఖాస్ మైదానంలో (Aamkhas Grounds) సభకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సభ అనుమతుల కోసం పోలీసులకు Bharat Rashtra Samithi (BRS) దరఖాస్తు చేసుకోగా వారు షాక్ ఇచ్చారు. సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడ కాదు మిలింద్ కళాశాల వద్ద సమావేశం నిర్వహించుకోవాలని పోలీసులు ప్రత్యామ్నాయం చూపించారు. అయితే ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ అంగీకరించలేదు. తాము నిర్ణయించుకున్న చోటే నిర్వహించాలని పట్టుబట్టారు. దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను నిర్వహించి తీరాలని గులాబీ దళపతి ఉన్నారు.
నాందేడ్ జిల్లాల్లో (Nanded District) నిర్వహించిన సభల కన్నా అద్భుతంగా.. భారీ ఎత్తున నిర్వహించాలని పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తమ సభకే అడ్డంకులు సృష్టిస్తారా.. మా తాకత్ ఏమిటో చూపించాలనే పట్టుదలతో ఈ సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పోటీ చేయనుంది. అందులో భాగంగానే వరుస సభలు మహారాష్ట్రలో నిర్వహిస్తున్నారు. మరి 24న నిర్వహించే సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.