SRD : సదాశివపేట పట్టణంలో జన గణన విధుల్లో మార్పులు చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శివాజీకి వినతి పత్రం సమర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. ఒకే ఉపాధ్యాయునికి రెండుచోట్ల విధులు కేటాయించినట్లు చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు.