SRD: విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈనెల 24వ తేదీన ధర్నా నిర్వహిస్తున్నట్లు టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమశేఖర్, రామచందర్ తెలిపారు. ఇవాళ సంగారెడ్డిలోని సంఘ భవనంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం బడ్జెట్లో 8.2 శాతం నిధులు కేటాయించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.