NRPT: నర్వ మండల పాతర్చెడ్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాల భూమిపూజ గురువారం సర్పంచ్ లింగమ్మ, ఎంపీడీవో శ్రీనివాసులూ కలిసి నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచే లక్ష్యంతో కొత్త లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆంజనేయులు, మండల అధ్యక్షుడు చెన్నయ్య పాల్గొన్నారు.