SRD: కంగ్టి మండలం నాగూర్ కే గ్రామానికి చెందిన మహిళా మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆలూరి మహానంద గణేష్ లడ్డూను రూ. 41 వేలకు దక్కించుకున్నారు. కంగ్టిలోని యోగి గణేష్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి వేలం పాటలో పాల్గొని, గణేషుడిపై ఉన్న నమ్మకంతో వేలంపాటలో పోటీపడి లడ్డు ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి ప్రసాదాన్ని అందజేశారు.