SRCL: శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు భక్తిశ్రద్ధలతో నైవేద్యం వండి బోనం తయారుచేసి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారికి బోనం, పసుపు కుంకుమలు, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.