WGL: వర్ధన్నపేట మండలంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సాయిబాబు హెచ్చరించారు. కిరాణాషాపులు, పాన్ డబ్బాలు, ముఖ్యంగా స్కూల్స్, కాలేజీల పరిసరాల్లో గుట్కా, అంబర్, సిగరెట్లు అమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇలాంటి విక్రయాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.