GDWL: వడ్డేపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బోయ నాగరాజు శనివారం కార్యకర్తలతో సమావేశయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయన మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా ఉపకార వేతనాలు ఆలస్యం కావడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని వాఖ్యానించారు.