NLR: జిల్లాలో త్వరలోనే రైతాంగానికి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కానున్నట్లు మంత్రి ఆనం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు కలిపి మొత్తం రూ. 20 వేలను ప్రభుత్వం ఇస్తుందన్నారు. మూడు దఫాలుగా రైతులకు ఈ నిధులు అందనున్నట్లు మంత్రి తెలిపారు.