ATP: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం నగరపాలక డిప్యూటీ కమిషనర్ పావనికి ఆయన వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు షరతులు లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలన్నారు.