TG: జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిత్య(21) అనే విద్యార్థిని HYDలో ఉంటూ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఈక్రమంలో ఆమె ఫ్రెండ్స్ చదువుల్లో వెనకపడ్డావని అవమానించడంతో తట్టుకోలేకపోయింది. ఈ నెల 2న తన సొంతూరుకు వచ్చి గడ్డిమందు తాగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న కన్నుమూసింది. దీంతో పోలీసులు స్నేహితులు వైష్ణవి, సంజనపై కేసు నమోదు చేశారు.