ASR: ప్రభుత్వ భూముల ఆక్రమణలను పక్కాగా తొలగించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. శనివారం తాహసీల్దారులు, ఎంపీడీఓలతో భూ ఆక్రమణలపై సమావేశం నిర్వహించారు. కోర్టు కేసుల విషయంలో కోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ భూములు, బంజరు భూములు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆక్రమణదారులకు ముందుగా నోటీసులు జారీ చేయాలన్నారు.