VZM: గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామంలో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏడాదిలో చేసిన, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి ఇంటింటికి వెళ్లి వివరించారు. ఇందులో ఆండ్ర నీటిపారుదుల ప్రాజెక్ట్ ఛైర్మన్ కోడి సతీష్, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, క్లస్టర్ ఇంఛార్జ్ వైకుంఠం వెంకట ప్రదీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.