»Bandi Sanjay Nayudu To High Court On University Suspension
High Court : యూనివర్సిటీ సస్పెన్షన్ పై హైకోర్టుకు బండి సంజయ్ తనయుడు
బీజేపీ (BJP) స్టేట్ చీఫ్ బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ(Bandi Sai Bhagiratha)పై వివాదం మరింత వేడెక్కింది. తోటి విద్యార్థులను కొడుతున్న రెండు వీడియోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగింది తెలిసిందే. వరుస వివాదాలు, కేసులు కారణంగా సాయి భగీథపై మహేంద్ర యూనివర్సటీ (Mahendra University) నుండి సస్పెండ్ చేశారు. దీనిపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఈ వీడియోలో బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు కావడంతో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో.. బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్ ఇవాళ హై కోర్టు ను ఆశ్రయించారు.
బీజేపీ (BJP) స్టేట్ చీఫ్ బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ(Bandi Sai Bhagiratha)పై వివాదం మరింత వేడెక్కింది. తోటి విద్యార్థులను కొడుతున్న రెండు వీడియోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగింది తెలిసిందే. వరుస వివాదాలు, కేసులు కారణంగా సాయి భగీథపై మహేంద్ర యూనివర్సటీ (Mahendra University) నుండి సస్పెండ్ చేశారు. దీనిపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఈ వీడియోలో బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు కావడంతో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో.. బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్ ఇవాళ హై కోర్టు ను ఆశ్రయించారు. జనవరి 20 న భగీరధ్ ను మహేంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ సస్పెండ్ చేసిందని కోర్ట్ కు భగీరధ్ వెల్లడించారు.ఇంటర్నల్ పరీక్షలు(Internal tests) రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్ట్ ను కోరాడు. అయితే.. పిటిషన్ ను విచారించిన హైకోర్ట్ (High Court).. భగీరధ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే విధించింది. పరీక్షకు రాసేందుకు అనుమతి ఇవ్వాలని యూనివర్సిటీ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మార్చ్ 9 న హై కోర్ట్ ఉత్తర్వులు జారీచేసింది. కోర్ట్ అదేశలతో బండి భగీరద్ పరీక్షలు రాశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భగీరధ్ ను క్లాస్ లోకి అనుమతించాలని యూనివర్సిటీ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ వైపు నేతల మధ్య ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మరో వీడియో (Video) లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది. తోటి విద్యార్థి అని కనికరం లేకుండా కాళ్లతో విచక్షణారహితంగా బాధిత విద్యార్థిపై కొట్టడం విద్యార్థుపట్ల ఇదే నా గౌరవం అంటూ కమెంట్లు చేస్తున్నారు.ఎంత తప్పుచేస్తే మాత్రం కాళ్లతో కొట్టాలా? అంటూ ప్రశ్నించారు. అయితే ఆ వీడియోలో దాడికి గురైన యువకుడి వీడియోను బీజేపీ (BJP) మద్దతుదారులు వైరల్ చేశారు. బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు భగీరథ్ కొట్టిన స్టూడెంట్ తానే ఓ అమ్మాయిని ఏడిపించడంతో అది తెలసిన భగీరత్ తనని కొట్టాడని ఆ యువకుడు చెప్పుకున్నాడు. భగీరథ్ స్టూడెంట్స్ పై దాడిచేసిన రెండు వీడియోలతో అటు బీఆర్ఎస్ (BRS) నేతలు, ఇటు బీజేపీ నేతలు ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media)హాట్ టాపిక్ గా మారింది.