»Cannabis Seized Again In Tirumala Chandrababu Responds
Tirumala: తిరుమలలో గంజాయి కలకలం.. చంద్రబాబు ఆవేదన
ఎవరికీ అనుమానం రాకుండా కాంట్రాక్టు ఉద్యోగి గంగాధరం గంజాయి ప్యాకెట్లను కాళ్లకు చుట్టుకుని రవాణా చేస్తుండటం చూసి అధికారులు షాక్ అయ్యారు. తిరుమల(Tirumala) కొండపై గంజాయి రవాణా జరుగుతుండటంపై టీడీపీ(TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని అన్నారు. భక్తుల మనోభావాల విషయంలో సర్కార్ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
తిరుమల(Tirumala)లో గంజాయి పట్టుబడిన ఘటన కలకలం రేపింది. తిరుమలలో గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టు కావడంతో భక్తులు షాక్ అవుతున్నారు. లక్ష్మీ శ్రీనివాసం కార్పొరేషన్ సంస్థ తరపున వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి(Contract Employee) వద్ద 125 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగి గంగాధరాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకుని తనిఖీ చేయగా గంజాయి వ్యవహారం బయటపడింది.
తిరుమలలో గంజాయి కలకలం ఘటనపై చంద్రబాబు చేసిన ట్వీట్:
తిరుమలలో గంజాయి వార్త షాక్ కు గురిచేసింది. రాష్ట్రంలో గంజాయి భూతం రోజురోజుకూ విస్తరిస్తోంది అనడానికి ఇదో సాక్ష్యం. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి అత్యంత ఆవేదన కలిగిస్తుంది. భక్తుల మనోభావాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలి. pic.twitter.com/quINyVtmS3
ఎవరికీ అనుమానం రాకుండా కాంట్రాక్టు ఉద్యోగి గంగాధరం గంజాయి ప్యాకెట్లను కాళ్లకు చుట్టుకుని రవాణా చేస్తుండటం చూసి అధికారులు షాక్ అయ్యారు. తిరుమల(Tirumala) కొండపై గంజాయి రవాణా జరుగుతుండటంపై టీడీపీ(TDP) అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని అన్నారు. భక్తుల మనోభావాల విషయంలో సర్కార్ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
నారా లోకేష్ చేసిన ట్వీట్:
టిటిడి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని 125 గ్రాముల గంజాయితో ఎస్ఈబీ పట్టుకుంది. దొరకని గంజాయి గజదొంగలు కొండపై ఇంకెందరు ఉన్నారో? ఇందుకా జగన్ నువ్వు ఒక్క ఛాన్స్ అడిగింది?(2/2)#YCPDrugMafia
టీడీపీ(TDP) నేత నారా లోకేష్(Nara Lokesh) కూడా తిరుమల(Tirumala)లో గంజాయి పట్టుబడిన విషయంపై స్పందించారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఏపీలో వైసీపీ(YCP) పాలన వల్ల గంజాయి ప్రదేశ్ అయిపోతోందన్నారు. ప్రఖ్యాత హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల(Tirumala)లో గంజాయి గుప్పుమంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.