GDWL: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు ‘సేవా పక్వాడా’ పేరుతో పక్షం రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బీజేపీ యువ నాయకురాలు డీ.కే. స్నిగ్ధ రెడ్డి తెలిపారు. శుక్రవారం కేటి దొడ్డి మండలంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మోదీ 11 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తయిందన్నారు.