MBNR: డోన్ రైల్వే సెక్షన్లో ఆధునిక 2 X 25 కిలోవోల్ట్ విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ అమలు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఈ మార్గం మరింత శక్తివంతమైన రైల్వే మార్గంగా మారనుంది. ఈ ప్రాజెక్టు రూ.122.81 కోట్లు వ్యయం కానుంది. ఈ క్రమంలో సుమారు 184 కిలోమీటర్ల రూట్ అప్ గ్రేడ్ చేయనున్నారు.