వరంగల్ జిల్లా రామన్నపేట గ్రామానికి చెందిన రాజేష్ ఖన్నాను తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని AITUC యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యూసఫ్ ఇవాళ ప్రకటనలో తెలిపారు. NHM, మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.