ADB: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఇంద్రవెల్లి మండలంలోని పలు కుటుంబాలను ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ శుక్రవారం పరామర్శించారు . ఇంద్రవెల్లి కేస్లాపూర్ నాగోబా మాజీ దేవాలయ ఛైర్మన్ మెస్రం నాగు,రమాబాయ్, ప్రభుదాస్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.