NRPT: మక్తల్ మండలం కాట్రేవ్ పల్లిలో పాలమూరు ఎంపీ డి.కె. అరుణ నిధులతో నిర్మించనున్న 232 మీటర్ల సీసీ రోడ్డుకు బీజేపీ నేత బి. కొండయ్య గురువారం శంకుస్థాపన చేశారు. ఇదే క్రమంలో గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను కూడా ఆయన ప్రారంభించారు. తమ గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించినందుకు గ్రామస్తులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ప్రజలు పాల్గొన్నారు.