JN: జనగామ పట్టణ కేంద్రంలోని హన్మకొండ రోడ్డులో నిర్మించిన కల్వర్టు పైపులు ఇటీవల కుంగి పోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని వెంటనే సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేశారు.