MBNR: పురపాలక కమిషనర్ రామానుజులు రెడ్డిని మహబూబ్నగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యవర్గ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రవీణ్, రమేష్, కమిటీ కార్యవర్గ సభ్యులు అంజయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.