MLG: వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ మోడల్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులు పోటీ ప్రపంచానికి అనుగుణంగా నూతన విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తిని కనబర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.