KMM: ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నేటి నుంచి కంటి పరీక్షలు ప్రారంభం కానున్నాయని డీఎంహెచ్ రామారావు తెలిపారు. పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలతో కూడిన బృందాలు రోజూ 300 మందికి పరీక్షలు చేయనున్నాయి. విద్యా, వైద్య శాఖల వారు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.