నిర్మల్ జిల్లాలోని దిల్వార్పూర్ గ్రామ పరిధిలోని అంజనీ తండాకు చెందిన రాథోడ్ బాబు నాయక్ మద్యం మత్తులో వాహనం నడుపుతూ మూడోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసులో ఆయనను బుధవారం ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, న్యాయమూర్తి 10 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు.