KNR: జిల్లాలో HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. విద్య, ఆరోగ్య, మహిళా సంక్షేమ, డీఆర్డీఏ, ఎస్సీ-ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు పరస్పర సహకారంతో పనిచేస్తే కార్యక్రమం మరింత సమర్థవంతంగా సాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.