NGKL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ప్రభుత్వయేతర సంస్థలు, పరిశ్రమలలో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఉందన్నారు.